మానవత్వం వీడని హిందూ అరేబియాన్......
ఈనాటి ఈ బంధమేనాటిదో..!
👣
తాను పసి పిల్లోడుగా ఉన్న సమయంలో పని పిల్లగా ఇంట్లో చేరి కన్న తల్లి కన్నా మిన్నగా తనను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన హిందూ మహిళను వెతుక్కొంటూ ఇండియా వచ్చాడు సౌదీ అరేబియాకు చెందిన అరబ్బు యువకుడు. కేరళకు ప్రత్యేక విమానంలో వచ్చి తన చిన్నప్పటి జ్ఞాపకాలను, ప్రేమతో పెంచిన ఆ అమ్మలగన్న అమ్మతో కలిసి పంచుకున్నారు.
సౌదీలో పొట్టకూటి కోసం వెళ్ళి తాను పెంచిన ఆ బాలుడు ఇప్పుడు పెద్ద యువకుడై తన వద్దకు రావడంతో సొంత కొడుకులా తన హృదయానికి హత్తుకుని మురిసిపోయింది. ఈ సందర్భంగా అతడు సొంత తల్లి కన్నా తనకు అనుబంధం పెంచిన తల్లితోనే అని, ఆమె చాలా గొప్పదని చెప్పడం గమనార్హం.
వృద్ధురాలయిన ఆమె సౌదీలో ఒక షేక్ ఇంటిలో ఎక్కువ కాలం పని చేసి చాలా కాలం క్రితం సొంత ఊరు ఇండియా కేరళకు తిరిగి వచ్చింది. ఆమె శేష జీవితానికి భరోసా కలిగించే విధంగా ఆ యువకుడు తగు చర్యలు చేపట్టి మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి సౌదీకి ఆ యువకుడు తిరిగి వెళ్ళాడు.