logo

రేగుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఘనంగా నిర్వహణ.. – స్వీట్లు పంపిణీ

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 19/02/2026:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, పెద్దలు కలిసి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం దేశభక్తి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపనలో చేసిన పోరాటం, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం గురించి వివరించారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం గ్రామస్థులకు మరియు పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

30
3189 views