ఎవరిది తప్పు....ఎవరికి శాపం..
గాజువాక( పెద్ద గంట్యాడ మండలం)
76వ వార్డ్ చిన్న పోరాట గ్రామం కమిటీ హాల్ కి ఆనుకుని ఉన్న ప్రహరీ గోడ పక్కన ఎలక్ట్రికల్ పోలుకు ఎలక్ట్రికల్ సిస్టం బోర్డ్ వేలాడుతున్న వైనం. స్థానిక ప్రజలు ఆవేదన మేరకు నిత్యం చిన్నపిల్లలు పెద్దవారు పశువులు తిరుగుతున్న ప్రదేశంలో ఎలక్ట్రికల్ సంబంధించి ప్రమాదం అంచున ఉన్న మీటర్ బోర్డును తక్షణమే తొలగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం. స్థానిక సబ్ స్టేషన్కు సమాచారం అందిద్దామని చూసిన ఎడల ఎలక్ట్రికల్ పోలు పైన ఉండవలసిన పోలు నెంబర్ కనబడకుండా సెప్టిక్ ట్యాంక్ సంబంధించి అడ్వటైజ్మెంట్ దర్శనం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా ఉన్నది. తక్షణమే పెద్ద గంట్యాడ ఎలక్ట్రికల్ విభాగ ఏఈ లైన్ మాన్ చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు.