logo

రాజాం అమ్మవారి జాతర సందర్భంగా వినోద కార్యక్రమాలలో భాగంగా జియో సర్కస్ ప్రారంభం

విజయనగరం జిల్లా.రాజాం.

ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ సంవత్సర జాతర మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు భక్తులు, ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. జాతర వేడుకలలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన జియో సర్కస్ కార్యక్రమాన్ని రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటేష్ మాట్లాడుతూ, జియో సర్కస్‌లో మణిపూర్, నేపాల్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన నైపుణ్యమైన కళాకారులు తమ అద్భుత విన్యాసాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ వినోదాన్ని పంచే విధంగా విభిన్న ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జాతర మహోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ప్రత్యేక వినోద కార్యక్రమాలను వీక్షించి ఆనందించాలన్నారు. భద్రతా పరంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

93
1800 views