logo

నూజివీడు మండలం, మోర్సపూడి గ్రామానికి చెందిన శ్రీ నేక్కంటి ఉపేంద్ర గారు నిన్న గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం తీవ్ర విషాదకరం.

నూజివీడు మండలం, మోర్సపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నేక్కంటి ఉపేంద్ర గారు నిన్న గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం తీవ్ర విషాదకరం.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు ఈరోజు మోర్సపూడి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి, ఉపేంద్ర గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఉపేంద్ర గారి సేవలు పార్టీకి అమూల్యమని, వారి అకస్మాత్తు మరణం పార్టీకి తీరని లోటని మంత్రి గారు పేర్కొన్నారు.

0
58 views