logo

ఇబ్రహీంపట్నంలో స్పెషల్ డ్రైవ్ – మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..

ఇబ్రహీంపట్నం ప్రతినిధి (తరి రాజశేఖర్) 18/02/2026:
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18:
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎస్సై జి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో కలిసి బైక్‌లపై ఆకతాయిలుగా తిరుగుతున్న వ్యక్తులు మరియు మైనర్ వయస్సు పిల్లలు డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి, వారి వాహనాలతో పాటు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. ఇకపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ జరిగితే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బైక్‌లపై ఆకతాయిలుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

23
1793 views