logo

నిరుపేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 2 లక్షలు ఇప్పించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

*నిరుపేద కుటుంబానికి పెద్దన్నగా నిలిచి రెండు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్* *ఇప్పించి మరోసారి మానవత్వం, తన పెద్ద మనసు చాటుకున్న* *ఎమ్మెల్యే కూన రవికుమార్* *గారు*

*👉నిరుపేద కుటుంబానికి CMRF సాయం* – *చిలకపాలెం వాసి చిలక కరువోడు* *కుటుంబానికి రూ.2 లక్షలు CMRF* *చెక్ అందచేసి పేద ప్రజల సంక్షేమం* *కోసం వాళ్ల కష్టాల కోసం ఎంత* *బలంగా నిలబడతారు అనేది* *మరొకసారి నిరూపించినఎమ్మెల్యే కూన* *రవికుమార్ గారు*

✅ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పియుసి) చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ఎచ్చెర్ల మండలంలో చిలకపాలెం గ్రామానికి చెందిన చిలక కరువోడు కుటుంబానికి CMRF రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) విభాగం ద్వారా వైద్య చికిత్స సహాయ నిమిత్తం మంజూరైన రూ.2,00,000/- ను కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు విజయవాడలో అందజేశారు.

✅ఈ సందర్భంగా శ్రీ కూన రవికుమార్ గారు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వ సహాయ పథకాలు ఎంతో ఉపయోగం గా ఉంటాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా తమ వంతు కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

✅CMRF సహాయం అందడంతో కరువోడు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసమయాల్లో అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

1
78 views