logo

నంది విజ్ఞాన కేంద్రం బాలోత్సవం కాంపిటీషన్స్ లో రుద్రవరం మండలం ఎల్లావత్తుల 6వ తరగతి విద్యార్థి టి.హర్షిత్ మొదటి బహుమతి.

నంద్యాలలో బుధవారం నాడు నిర్వహించిన నంది విజ్ఞాన కేంద్రం బాలోత్సవం కాంపిటీషన్స్ లో రుద్రవరం మండలం ఎల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి టి.హర్షిత్ మట్టి బొమ్మలు తయారీ అంశంలో వైల్డ్ అనిమల్స్ ని మట్టి బొమ్మలు తయారుచేసి ప్రదర్శించడంతో మొదటి బహుమతి పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లావత్తుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి హర్షిత్ కు అభినందనలు తెలిపారు. ఈ కాంపిటీషన్ కి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగిందని ఇందులో ఎల్లా వత్తుల ఉన్నత పాఠశాల విద్యార్థి మొదటి బహుమతి పొందడం పాఠశాల మరియు గ్రామానికి అభినందదాయకమని తెలిపారు.

10
1159 views