ఆర్టీఐ జిల్లా కోకన్విర్ గా.కుమార్ యాదవ్ నియామకం.
ఆర్టిఐ రాష్ట్ర కన్వీనర్ ఎం.మహేష్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో కన్వీనర్ గా మల్హర్ రావు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన చింతల కుమార్ యాదవ్ ను నియామకం చేసినట్లుగా జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు 2020లో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడుగా మలహర్ మండల కమిటీ అధ్యక్షుడిగా కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ గా భూపాలపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతూ ప్రభుత్వ అవినీతి అధికారుల్లో గుండెల్లో రైలు పరిగెత్తించిన కుమార్ యాదవ్ కు ఉందన్నారు.సమాచార హక్కు చట్టం అర్జీలు పెట్టి అవినీతికి తావు లేకుండా పేద ప్రజల న్యాయం జరిగే విధంగా ఆయన కృషి చేశారని తెలిపారు.ఎన్నికైన కుమార్ యాదవ్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా అవినీతి పాలనకు అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం వజ్రాయుధంగా పనిచేస్తుందని తనపై నమ్మకంతో మరింతగా బాధ్యతలు అప్పజెప్పిన జిల్లా కన్వీనర్ కు జిల్లా కమిటీకి ,రాష్ట్ర కన్వీనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.