
ఒకరు కాదు ఇద్దరు కాదు..
*ముచ్చటగా ముగ్గురు మహిళా ఐఏఎస్‌లను పెళ్ళాడిన ఐఏఎస్ అధికారి*
జర్నలిస్టు : మాకోటి మహేష్
ఒకరు కాదు ఇద్దరు కాదు..
*ముచ్చటగా ముగ్గురు మహిళా ఐఏఎస్‌లను పెళ్ళాడిన ఐఏఎస్ అధికారి*
*వరుసగా ఇద్దరికి విడాకులిచ్చి మూడో ఐఏఎస్‌తో కాపురం*
{ఆమెతో ఎన్నాళ్ళో ఎవరికీ తెలీదు}
ఈరోజుల్లో అమ్మాయిలు దొరక్క ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు. వయసు పైబడుతున్నా.. వెంట్రుకలు నెరిసిపోతున్నా.. పెళ్లి కాని ప్రసాద్‌లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.
కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం.
ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు...?
ఆయన కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే!!
అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లో నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో చేరింది. ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఆమెతో ఏమైందో తెలియదు గానీ.. నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఆఖరికి ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు. ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్‌లో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంత మంది వ్యక్తిగతం అనగా.. ఇంకొందరు తప్పుపట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు.
ఇదిలా ఉంటే మూడవ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పనిచేస్తున్నారు. గతంలో అనేక జిల్లాల్లో కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.