
కుంభమేళాను తలపించే శ్రీముఖలింగేశ్వర చక్రతీర్థ స్థానాలు
AIMA న్యూస్ శ్రీకాకుళం :
కుంభమేళ ఈ పేరు మనం చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం.. ఉత్తరాదిలో పుష్కర కాలానికి ఓసారి ప్రయాగ.. త్రివేణి సంగమములో.. కోట్లాది భక్తుల తీర్థ స్నానాలు .. మనకు గుర్తుకు వస్తుంది..
అయితే అటువంటి కుంభమేళాను తలపించే చక్ర తీర్థ స్నానాలు మన ఉత్తరాంధ్రలో అది శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ దైవ క్షేత్రంలో జరుగుతుంది అని మీకు తెలుసా?
మీరు ఎప్పుడైనా హాజరయ్యారా???
అయితే రండి ఉత్తరాంధ్ర కుంభమేళా గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగం క్షేత్రం ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి... పూర్వం కలింగుల రాజధాని నగరి కటకం ప్రక్కనే ఈ శైవ క్షేత్రం వారి ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలు జరిగేవి...
అదే వారసత్వాన్ని ఇక్కడి వారి సామాజిక వర్గానికి చెందిన అర్చకులు. శ్రీముఖ లింగేశ్వరుడి సేవలో కొనసాగుతుండటం విశేషం..
ఇక్కడ మిగతా దేవాలయాలలో వలె బ్రాహ్మణులు పూజారులుగా కనిపించరు.
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అత్యంత బలమైన సామాజిక వర్గం కాలింగులు.. వీరి తెగకు చెందిన వారి ఇక్కడ పూజారులుగా ఉండటం విశేషం
కోటిలింగాలకు ఒక లింగం తక్కువ అయిందట.. అందుకని దక్షిణ కాశీగా శ్రీముఖ లింగం క్షేత్రాన్నీ పిలుస్తారు.. ఇక్కడ స్వామి వారిని మధుకేశ్వర స్వామిగా పిలుస్తారు.. అంతేకాకుండా శివలింగం
ముఖ ఆకృతితో ఉండే శివలింగం ప్రతిష్టించబడ్డ ప్రాచీన దేవాలయం కాబట్టి శ్రీముఖలింగేశ్వరుడు అని ఇక్కడి శివున్ని ఆరాధిస్తారు..
ఒరిస్సా కొండలలో పురుడు పోసుకున్న వంశధార నది కొండలు, కోణాలు అడవులు గుండా ప్రవహిస్తూ రకరకాల వైద్య మూలికలను వడ పెట్టుకుని వచ్చే మహోత్తర ఔషధ గుణాలు కలిగిన వంశధార నది తీరాన శ్రీముఖలింగం ఉండటం ఇక్కడి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే శరీరానికి సంబంధించిన సకల అనారోగ్య దోషాలు తొలగిపోతాయి అంటూ ఉత్తరాంధ్ర జానపదుల అమితమైన విశ్వాసం అనేకన్నా గొప్ప నమ్మకం...
శివరాత్రి నాడు ప్రారంభమయ్యే మూడు రోజుల మహా శివయ్య జాతర అనంతరం స్వామి వారిని దేవాలయంలోని ఉత్సవ మూర్తుల రూపంలో లక్షలాదిమంది భక్తుల జన వాహిని మధ్య పల్లకిలో వంశధార నదిలోనికి చక్ర తీర్థ స్నానాల కోసం తీసుకొని వస్తారు... ఆరోజు ఉదయం నుంచి దేవాలయంలో సకల పూజలు నిర్వహించిన తరువాత మిట్ట మధ్యాహ్నం కల్లా స్వామివారి చక్ర తీర్థ స్నానాలు జరిపిస్తారు...
ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో పలు ప్రాంతాల నుంచి కూడా కుటుంబ సమేతంగా స్వామివారి చక్రధర్ తీర్ధ స్నానాలకు ఆకాశం బద్దలయ్యిందా నేల ఈనెల అన్నట్టు విశేష భక్త వాహిని హాజరవుతారు..
దేవుడే స్వయంగా వంశధార నదిలో స్నానం ఆచరించి భక్తులచే స్నానం చేయించే అపురూపమైన అరుదైన ఘట్టం ఈ చక్ర తీర్థ స్నానాలు. కుల వర్గాలకు అతీతంగా కుటుంబ సమేతంగా ఇంటిలోపాలి స్నానము ఆచరించి ఒక గొప్ప మహోత్తర కార్యక్రమమే ఈ చక్ర తీర్థ స్నానాలు
వంశధార నదికి యువతల వైపు అవతల వైపు
శ్రీముఖలింగానికి చుట్టూరా ఉండే కొన్ని గ్రామాల ప్రజలు ఎక్కడెక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులను ఆహ్వానించి మధ్యాహ్నం ఈ చక్ర తీర్థ స్నానాల అనంతరం విందు కూడా ఏర్పాటు చేస్తారు.
మరి కొంతమంది అయితే శ్రీముఖలింగానికి నదికి ఇరువైపులా ఉండే తోటలలో వంటలు చేసుకుంటూ అక్కడే స్వామివారికి ప్రసాదాన్ని నివేదిస్తూ మూడు రోజులపాటు రాత్రి పూట పగటిపూట జరిగే యాత్రను ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిపోయే గొప్ప జాతర ఈ శ్రీముఖలింగం చక్ర తీర్థ స్నానాలు..
ఈ ఏడాది అమావాస్య తగులు మిగులు ఉండటం మూలంగా బుధవారం నాడు ఈ చక్ర తీర్థ స్నానాలను నిర్వహిస్తున్నారు..
అశేష భక్త జనం వస్తారు కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం నేరుగా ఎస్పీ డిఎస్పి గారి పర్యవేక్షణలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు జరుగుతుంది..
అనాదిగా వస్తున్న ఆచారం జిల్లా కలెక్టర్ గారు ఆగమనంతో స్వామివారిని దర్శించుకున్న తరువాత పల్లకి యాత్రను స్వయంగా ఆయన సమక్షంలో మొదలు పెడతారు . ఈ చక్ర తీర్థ స్నానాల జాతర చూడటానికి రెండు కన్నులు చాలు అంటే అతిశయోక్తి కాదేమో.. మరెందుకు ఆలస్యం రండి ప్రతి ఒక్కరు చూసేద్దాం చక్ర తీర్థ స్నానాల జాతర...