logo

*అసెంబ్లీలో తన గళాన్ని మరోసారి బలంగా వినిపించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు* *వంశధార నదిపై ప్రత్యామ్నాయంగా భారీ వాహనాలు వెళ్లేందుకు వంతెనను మంజూరు చేయాలి*

*అసెంబ్లీలో తన గళాన్ని మరోసారి బలంగా వినిపించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు*

*వంశధార నదిపై ప్రత్యామ్నాయంగా భారీ వాహనాలు వెళ్లేందుకు వంతెనను మంజూరు చేయాలి*

*మహేంద్రతనయ నదిపై పాతపట్నం నుంచి కె మరియు హెచ్ గోపాలపురం వెళ్లేందుకు వంతెనను నిర్మించాలి*

*వర్షాకాలంలో రైల్వే వంతెన పై ప్రమాదకరమైన ప్రయాణం చేయాల్సి వస్తుందని ఇందుకు నేను కూడా ఒక ఉదాహరణని ఎమ్మెల్యే గారు విన్నవించారు*

*బూరగాం గ్రామం వద్ద మహేంద్రతనయ నదిపై పొలాలకు వెళ్లేందుకు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి*

*దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న కళ్ళట - జిల్లోడుపేట గ్రామాలకు వంశధారపై వంతెనను నిర్మించాలని విన్నవించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు*

*అభివృద్ధిలోనూ,తలసరి ఆదాయంలోనూ రాష్ట్రంలోనే వెనుకకు నెట్టబడిన నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గమని అభివృద్ధికి సహకరించాలని విన్నవించిన ఎమ్మెల్యే గారు*


*రవాణా మార్గాలు (రహదారులు,వంతెనలు)సక్రమంగా ఉంటేనే ఆ ప్రాంతము లేదా నియోజకవర్గము,రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని కనుక మా పాతపట్నం నియోజకవర్గంలో రహదారులతో పాటు అవసరమైన చోట వంశధార,మహేంద్రతనయ నదులపై వంతెనలను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తన గళాన్ని మరోసారి బలంగా వినిపించిన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు,అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ శ్రీ మామిడి గోవిందరావు గారు,ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం మన రాష్ట్రానికి చిట్టచివరన ఒడిస్సా రాష్ట్రానికి సరిహద్దు గల నియోజకవర్గమని ఇక్కడి ప్రజలు అభివృద్ధిలోనూ తలసరి ఆదాయంలోనూ దశాబ్దాల కాలంగా వెనుకకు నెట్టుబడిన నియోజకవర్గమని అందుకుగాను నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సహకరించాలని విన్నవించారు ముఖ్యంగా హిరమండలం వద్ద వంశధార నదిపై గొట్టా బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా హిరమండలం - భగీరథపురం గ్రామం వద్ద మరో వంతెనను నిర్మిస్తే గొట్టా బ్యారేజీపై ఒత్తిడి తగ్గి బ్యారేజీ రక్షణతో పాటు ప్రజల సమయము మరియు భారీ వాహనాల రవాణా కూడా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు అలాగే పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని పాతపట్నం మేజర్ పంచాయతీలో భాగమైన కాపు గోపాలపురం,హరిజన గోపాలపురం గ్రామాలకు వెళ్లేందుకు మహేంద్రతనయ నదిపై తక్షణమే వంతెనను నిర్మాణం చేపట్టాలన్నారు వర్షాకాలం వస్తే ఇక్కడ రైల్వే వంతెన పైనుంచే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి ఉంటుందని విన్నవించారు అదేవిధంగా బూరగాం గ్రామం వద్ద రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు అనువుగా మరియు పండించిన పంటలను సకాలంలో గిట్టుబాటు ధర పొందేందుకు దళారీ వ్యవస్థ లేకుండా లాభదాయకంగా పండిన పంటలు అమ్మేందుకు అనువుగా వంతెనను ఏర్పాటు చేయాలని వివరించారు ముఖ్యంగా దశాబ్దాల కాలంగా వంశధార నదిపై పెండింగ్ లో ఉన్న కళ్ళట - జిల్లేడు పేట వంతెనను తక్షణమే "రీ -టెండర్"లను పిలిచి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు గతంలో మన ప్రజా ప్రభుత్వం 2019లో ఈ బ్రిడ్జి కు శంకుస్థాపన చేయగా తరువాత వచ్చిన వైసీపీ సైకో ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు కనుక తక్షణమే మరలా మన ప్రభుత్వం స్పందించి ఈ వంతెనలకు నిధులను మంజూరు చేసి సకాలంలో పూర్తిచేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రివర్యులకు, ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు విన్నవించారు*

10
1195 views