logo

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఎలక్ట్రికల్ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు.

పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఎలక్ట్రికల్ మోటార్ల దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం 7 ఎలక్ట్రికల్ మోటార్లు, ఒక ఆటో రిక్షా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ కాబడిన వారు:
🔹 చొక్కా నాగ దుర్గారావు అలియాస్ పెంటయ్య (32)
🔹 చింతపల్లి నాగరాజు (36)
🔹 బొచ్చ వినోద్ కిరణ్ (33)
స్వాధీనం చేసిన మోటార్లు వివిధ కంపెనీలకు చెందినవి. ప్రతి మోటార్ మార్కెట్ విలువ సుమారు రూ.18,000 కాగా, నిందితులు వాటిని ఒక్కొక్కటి రూ.1,500కి విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.1,26,000.
దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా నేరమే. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించండి.
ఈ కేసును ఛేదించిన ఎస్‌.ఐ శ్రీ R. శ్రీను గారు మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

0
0 views