మెట్‌పల్లిలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం..
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 18/02/2026:
మెట్‌పల్లి పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రికి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కి కార్మిక సంఘం పక్షాన ఘన సన్మానం నిర్వహించారు. మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులను శాలువాలతో సత్కరించి పూల బొకేలు అందజేశారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి పనులతో పాటు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం నూతన పాలకవర్గం కట్టుబడి పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే 3వ వార్డు కౌన్సిలర్ బత్తుల నరేష్ ని, 13వ వార్డు కౌన్సిలర్ గుడి కందుల అజయ్ ని కూడా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లంక శ్రీకాంత్, మధురమ్మ, అనిల్, ఉస్మాన్ తదితరులు, పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.