logo

కడప నగర సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ కమిషనర్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్•••••

ఇంటింటికి కాంగ్రెస్ 15 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 38 వ డివిజన్ సమస్యలను మరియు ఇంకా కొన్ని డివిజన్లో సమస్యలను పరిష్కారం కోసం కడప కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ కలవడం జరిగింది. కమిషనర్ తో సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ కడప నగరంలోని 38వ డివిజన్లో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే అడిషనల్ కమిషనర్ దృష్టి కూడా ఈ సమస్యలను తీసుకొని వెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించాలని లేని పక్షాన ప్రజల తరఫున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తామని, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యం అని, ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షునితోపాటు కాంగ్రెస్ నగర డివిజన్ ఇన్చార్జులు, యూసుఫ్, షామీర్ భాష, అంజన్ కుమార్, సాదిక్, మహబూబ్ బాషా, సర్దార్, ఖాజాపీర్, కరీం, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.

0
615 views