న్యాయవాదులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
*దమ్మపేట బార్ అసోసియేషన్ నిరసన,
న్యాయవాదులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
*దమ్మపేట బార్ అసోసియేషన్ నిరసన,
న్యాయవాదుల హత్యలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ
*మాజీ ఎమ్మెల్యే మెచ్చ,
దమ్మపేట, ఫిబ్రవరి 17:( కానుక న్యూస్ జిల్లా ప్రతినిధి)
న్యాయవాదులపై జరిగే దాడులను ఖండిస్తూ దమ్మపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం నాడు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి మద్దతుగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎం.ఎల్.ఎ , బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు... దుర్మార్గంగా న్యాయవాదులను హత్య చేసిన హంతకులను చట్ట పరంగా శిక్షించాలని. న్యాయవాదులకు తక్షణమే ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.