
తప్పులకు దేవుడు శిక్షించాడు.. జగన్ ఎప్పుడు తెలుసుకుంటారు?....
లడ్డూ కల్తీకి వైసీపీ కన్వర్టెడ్ గ్యాంగ్ సమర్థనలు – ఇదేం ప్లాన్ !?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచింది. అయితే, ఈ పాపానికి బాధ్యత వహించాల్సిన వైసీపీ అగ్రనాయకత్వం, తప్పును ఒప్పుకోవడానికి బదులు వింత వాదనలతో సమర్థించుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా వైకాపా సానుభూతిపరులుగా ముద్రపడిన కొందరు కన్వర్టర్ క్రిస్టియన్ ప్రముఖులు ఈ వివాదంలోకి ప్రవేశించి, కల్తీ పెద్ద తప్పు కాదన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. స్పేసులుపెడుతున్నారు.
హిందూ సమాజాన్ని పదే పదే అవమానిస్తున్న వైసీపీ సానుభూతిపరులు
రావణ్ అలియాస్ జోసఫ్ , జడ శ్రవణ్, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ వంటి వ్యక్తులు చేస్తున్న ఈ వాదనలు హిందూ సమాజంలో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. వైసీపీని సమర్థిస్తున్న ఈ ప్రముఖుల్లో చాలామంది బహిరంగంగానే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నవారు. వీరికి తిరుమల పవిత్రతపై గానీ, ప్రసాద విశిష్టతపై గానీ కనీస గౌరవం లేదన్నది బహిరంగ రహస్యం. వీరు ప్రసాదాన్ని స్వీకరించరు, కనీసం ఆ క్షేత్రాన్ని దర్శించరు. కానీ, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ కల్తీని వెనకేసుకొస్తుండటాన్ని చూస్తుంటే, దీని వెనుక జగన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేనలు లడ్డూ అంశంపై చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు వైకాపా ఈ గ్యాంగ్ ను ప్రయోగించినట్లు కనిపిస్తోంది.
భక్తుల మనోభావాలపై ఎంత కాలం దాడి చేస్తారు?
జగన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ తెలివితేటలు ఆయనను హిందూ సమాజానికి మరింత దూరం చేస్తున్నాయి. ఇప్పటికే తన పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు, అన్యమత ప్రచారాల విషయంలో జగన్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పుడు లడ్డూ వంటి సున్నితమైన అంశంలో క్రైస్తవ మతాన్ని ఆచరించే వారితో సమర్థనలు చేయించడం వల్ల, హిందువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అన్యమతస్థులు హిందువుల ఆచారాలను, ప్రసాదాలను కించపరిచేలా మాట్లాడితే అది జగన్ రాజకీయ పునాదులనే కదిలిస్తుంది.
తప్పులకు దేవుడు శిక్షించాడు.. జగన్ ఎప్పుడు తెలుసుకుంటారు?
పైన దేవుడున్నాడని తరచూ చెప్పే జగన్, తనను ఆ దేవుడే శిక్షిస్తున్నాడనే నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకుని దేవుడి శాంతిని కోరాల్సింది పోయి, మరింత మందితో తప్పుడు ప్రచారాలు చేయించడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. హిందూ సమాజపు మనోభావాలతో ఆడుకుంటున్న ఈ కన్వర్టెడ్ గ్యాంగ్ సమర్థనలు చివరికి వైకాపా పతనానికి నాంది పలుకుతాయనడంలో సందేహం లేదు. దేవుడితో పెట్టుకోవడం ఎంతటి పెను సమస్యను తెచ్చిపెడుతుందో జగన్ రెడ్డికి కాలమే సమాధానం చెబుతుందని అనుకోవచ్చు.