logo

ఈ నెల 17వ తేదీన నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*....



*ఈ నెల 17వ తేదీన నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*
- *ఈ నెల 17వ తేదీన నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం (నేషనల్ డీ వార్మింగ్ డే) నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.*

- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరం అని, విద్యార్థినీ విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17, 24న చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమమును జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 1 - 19 ఏళ్ల మధ్యనున్న 5,99,852 మంది చిన్నారులకి ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, బడి బయటి పిల్లలు, బడి బయట కౌమార దశలో పిల్లలు, ఐటిఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, నర్సింగ్, డిగ్రీ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలోని వారు అందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, డివిఈఓ, డిఎంహెచ్ఓ, తదితర సంబంధిత అధికారులను అప్రమత్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమం ముందస్తుగా అందేలా చూడాలని, అలాగే జిల్లాలో ఈనెల 17వ తేదీన అన్ని పాఠశాలలు ఇంటర్మీడియట్ ఒకేషనల్ అంగన్వాడి తదితర కేంద్రాల్లో ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు భోజనం చేసిన తర్వాత 1-2 సం.లోపు పిల్లలకు చప్పరించే ఆల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలో సగం, 2-19 సం. ల లోపు వారికి మింగించాలన్నారు.*

- *పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలంటే ఆరోగ్యం కూడా చాలా అవసరమన్నారు. నులిపురుగుల బారిన పడకుండా శారీరక, మానసిక ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపొందాలన్నా పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు. నులిపురుగులు పిల్లల ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయని, దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందని, అంతేకాకుండా రక్తహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపునొప్పి, వికారం విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి పరిస్థితులను పిల్లలకు దూరం చేసి నులిపురుగులను నిర్మూలించి మంచి ఆరోగ్యంగా ఉండేందుకు అల్బెండజోల్ మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 2 సం.పైన నుండి 19 సంవత్సరాల పిల్లలు, కిశోర బాలలకు 400 ఎం.జి. మాత్రలు, 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర అనగా 200 ఎం.జి ట్యాబ్లెట్ భోజనం చేసిన తరువాత చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.*

- *జిల్లా వ్యాప్తంగా పిల్లలు, కిషోర బాలల కడుపులో నులి పురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను సంబంధిత విద్యా సంస్థలకు ముందస్తుగా అందేలా చర్యలు తీసుకావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించ వచ్చునని పేర్కొన్నారు. 1-2 సం.ల పిల్లలకు సగం మాత్ర 200 mg , 2 సం. పై బడి 19సం.ల పిల్లలకు 400mg ఒక మాత్ర చప్పరిస్తూ మింగించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏదేని కారణం చేత డీ-వార్మింగ్ చేయబడని పిల్లలకు మరలా ఫిబ్రవరి 24న మాప్ అప్ రోజున ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.*

- *ఈ సమావేశంలో డిఆర్ఓ మలోల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఈబి.దేవి, ఐడిఎస్పీ నోడల్ ఆఫీసర్ డా.సురేంద్రరెడ్డి, ఆర్బీఎస్కే నోడల్ అధికారి డా.విష్ణుమూర్తి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్బీఎస్కే రజిత, పశుసంవర్ధక శాఖ జెడి ప్రేమ్ చంద్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, డిఎంఓ ఓబులు, డిఈఓ ప్రసాద్ బాబు, ఇంటర్మీడియట్ కన్వీనర్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటి మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యం.వెంకటరమణ నాయక్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

3
100 views