logo

జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి తిమ్మప్ప సేవలు ఎంతో గొప్పవి*....


*జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి తిమ్మప్ప సేవలు ఎంతో గొప్పవి* జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*జిల్లా సైనిక్ సంక్షేమ అధికారిగా పనిచేసిన తిమ్మప్ప మాజీ సైనికులు, సర్వింగ్ సోల్జర్స్, వారి కుటుంబ సభ్యులకు చేసిన సేవలు ఎంతో గొప్పవని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనంలోని విసి హాల్ లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప తన పదవీ కాలం పూర్తి చేసుకుని సొంత ఐ.అండ్.పీఆర్ శాఖలో త్వరలో జెడి ప్రమోషన్ ఉన్నందున హెడ్ క్వార్టర్స్ విజయవాడకు తిరిగి వెళుతున్న సందర్భంగా జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి తిమ్మప్పకు జిల్లా అధికారుల సంక్షేమ సంఘం తరఫున జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ మలోల, పలు శాఖల జిల్లా అధికారులు శాలువా కప్పి, జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు.*

- *అలాగే అర్హులైన మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు, వీరనారీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అందించడంలో, సైనిక పతాక దినోత్సవ నిధికి గత సంవత్సరం, ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు రూ 15 లక్షల విరాళాల్ని సేకరించారని, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అర్హులైన మాజీ సైనికులకు వ్యవసాయ భూమి పంపిణీకోసం ఫైళ్లు సిద్ధం చేయించడంలో మండల, డివిజనల్, కలెక్టరేట్ రెవెన్యూ అధికారులతో తిమ్మప్ప చక్కగా సమన్వయం చేశారని, అలాగే జిల్లా యంత్రాంగం మరియు జిల్లా అధికారుల మధ్య జిల్లా అధికారుల సంఘం నాయకుడిగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో మంచి సమన్వయం చేశారని, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, తదితరులు తిమ్మప్ప సేవలను ప్రశంసించారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా, జిల్లా అధికారుల సంఘం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించడంలో తనకు సంపూర్ణంగా సహకరించి ప్రోత్సహించిన అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు, డిఎల్ఎస్ఏ జడ్జి గారికి, రెవెన్యూ, పోలీసు అధికారులు, అన్ని శాఖల జిల్లా అధికారులకు, మాజీ సైనికులకు, వీర నారీలకు, సిబ్బందికి జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి తిమ్మప్ప కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.*

- *ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మరియు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు మలోల, జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రామసుబ్బారెడ్డి, జిల్లా ఫైర్ సర్వీసెస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్, మెప్మా పీడీ విశ్వజ్యోతి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా వ్యవసాయ అధికారి రవి, డిఈఓ ప్రసాద్ బాబు, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కమిటీ మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యం.వెంకటరమణ నాయక్, ఎల్డిఎం నరేష్ , ఉమ్మడి జిల్లా ఎస్సి కార్పొరేషన్ ఈడి కుముద, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, జిల్లా గ్రంధాలయం సెక్రెటరీ కమ్మన్న, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

0
0 views