ఉపాధి పనుల కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదు పూర్తిగా చేపట్టాలి*.....
*ఉపాధి పనుల కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదు పూర్తిగా చేపట్టాలి*జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
కేటాయించిన లక్ష్యం మేరకు ఉపాధి పనుల కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదు నెలాఖరులోగా పూర్తి స్థాయిలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), జిఎస్డబ్ల్యుఎస్, పి4, ఎన్ఆర్ఈజిఏ, పట్టాదారు పాసుపుస్తకాలు, పీఎం సూర్యఘర్ యోజన, ఏపిఎంఐపి, హౌసింగ్, తదితర అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఓలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*
- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజిఏ పనుల కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ నమోదుకు సంబంధించి 131 కోట్ల రూపాయలకుపైగా బిల్లుల నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 77.46 కోట్ల రూపాయలు నమోదు చేయడం జరిగిందని, మిగిలిన 53.82 కోట్ల రూపాయల బిల్లుల నమోదు ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లోడ్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ బిల్లుల నమోదు పూర్తి చేయాలని, బిల్స్ పెండింగ్ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యధిక ప్రాధాన్యత తీసుకొని ఉపాధి బిల్లుల అప్లోడ్ చేపట్టాలన్నారు. ఈ విషయమై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజు మూడు, నాలుగు కోట్ల రూపాయలు అప్లోడ్ చేయాలని, రోజు పంచాయతీరాజ్ ఏఈలు, ఆర్.డబ్ల్యు.ఎస్ ఏఈలు, ఎంపీడీవోలు మాట్లాడి బిల్లుల అప్లోడ్ పూర్తి చేయాలన్నారు. ఇందులో మూడు నాలుగు రోజుల్లో ఖచ్చితంగా పురోగతి రావాలని, ఈ విషయమై ప్రతిరోజు ఫీడ్బ్యాక్ అందించాలన్నారు. ఉపాధి కింద కొత్త పనులు మంజురవుతున్న నేపథ్యంలో పాత పనులు వెంటనే పూర్తి చేయాల్సినవి పూర్తిచేయాలన్నారు. లేబర్ బడ్జెట్, 90 డేస్ హౌసింగ్, తదితర అన్ని అంశాల్లో కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.*
- *యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను లక్ష్యం మేరకు చేపట్టాలని, వెనుకబడిన మండలాలు ప్రత్యేక దృష్టి పెట్టి సర్వేలో పురోగతి తీసుకురావాలన్నారు. సిటిజన్ ఈకేవైసీ సర్వేలో వేగం పెంచాలన్నారు. అక్షర ఆంధ్ర, అనంత ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు సంబంధించి రోజు రెండు మూడు లోకేషన్లను వెల్ఫేర్ అసిస్టెంట్లు విజిట్ చేయాలని, డిఎల్డివోలు, డిడివోలు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైనదిగా చూడాలన్నారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ చాలా వరకు పూర్తి కావడం జరగగా, వచ్చేనెలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, డిఎల్డివోలు, డిడివోలు, ఎంపీడీవోలు మండల ప్రత్యేక అధికారులు, ఈ కార్యక్రమాన్ని తనిఖీ చేసి నాణ్యత మరింత మెరుగుపరచాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, పీఎం సూర్యఘర్ యోజన, ఏపిఎంఐపి, హౌసింగ్, తదితర అంశాల్లో కేటాయించిన లక్ష్యంలకు అనుగుణంగా మరింత పురోగతి తీసుకురావాలని సూచించారు.*
- *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్డీసి పద్మావతి, సిపిఓ అశోక్ కుమార్, హౌసింగ్ పిడి శైలజ, డ్వామా పిడి సలీమ్ భాష, ఏపిఎంఐపి పిడి రఘునాథరెడ్డి, పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, జడ్పి సిఈఓ శివశంకర్, పిజిఆర్ఎస్ డిటి జయశ్రీ, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*