భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి
జర్నలిస్ట్ :ఆకుల గణేష్
రేగొండ మండలకేంద్రంలో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య గుండెపోటుతో మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. రేగొండకు చెందిన తడక స్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక భార్య రాధ కూడా గుండెపోటుతో మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.