logo

Hyd ఉప్పల్ :ఇద్దరిదీ ఒకటే ఊరు.. ఒకటే బడి.. ఒకే కళాశాల.. ఉద్యోగమూ ఒకే శాఖలో..

జర్నలిస్టు : మాకోటి మహేష్
Hyd ఉప్పల్ :ఇద్దరిదీ ఒకటే ఊరు.. ఒకటే బడి.. ఒకే కళాశాల.. ఉద్యోగమూ ఒకే శాఖలో.. ప్రస్తుతం కొలువూ కలిసిమెలిసే. వారే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామస్థులైన వీరు పదో తరగతి వరకు గ్రామకూడలిలోని శ్రీవిద్యానికేతన్‌ పాఠశాలలో చదువుకున్నారు.ఇంటర్, డిగ్రీలను మిర్యాలగూడలో పూర్తిచేశారు.డిగ్రీ పోలీసుశాఖలో ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి 2007 బ్యాచ్‌లో ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. అనుకోకుండా ఇద్దరూ ఉప్పల్‌ ట్రాఫిక్‌ పీస్ కు ఏడాదిన్నర క్రితం బదిలీ అయ్యారు. అక్కడ ఇన్‌స్పెక్టర్‌గా నాగరాజు, ఆర్‌ఐ (రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌)గా మల్లేశ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాము చిన్ననాటి స్నేహితులమనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. #Telangana

5
36 views