logo

రంజాన్ ను ఆస్వాదించండి అపుడే పుణ్యఫలాలు ప్రాప్తం అవుతాయి: జమాఆతె ఇస్లామీ నంద్యాల అధ్యక్షులు సమద్.

నంద్యాల (AIMA MEDIA): జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక విసీ కాలనీ నూరాని మస్జిద్ లో ఇస్తెఖ్బాల్ -ఎ-రమజాన్ మరియు తక్మిలే నాజిరా ఖుర్ఆన్ కార్యక్రమం ద్వారా రంజాన్ స్వాగత సమావేశం సాయింత్రం ఘనంగా నిర్వహించారు. నూరాని మస్జిద్ ఇమామ్ మరియు మదరసా ప్రధానోపాధ్యాయులు మౌలానా అబ్దుల్లా భాఖవి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖుర్ఆన్ పారాయణం పూర్తి చేసిన పది మంది విద్యార్థులు రమణీయంగా ఖుర్ఆన్ చదివి వినిపించారు. జనాబ్ అబ్దుల్ సమద్ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా హాజరైనా ప్రొద్దుటూరు జెఐహెచ్ నాయకులు మౌలానా అబ్దుల్ ఖదీర్ ఉమ్రి తన ప్రసంగంలో రమజాన్ మాసం ప్రాముఖ్యతా, ఆ మాసంలో దైవారాధన లో ఎలా లీనం కావాలో వివరించారు. నిష్ఠగా గరిష్ట తో ఉపవాసాలు గడపాలని, దానధర్మాల్లో ముందుండాలని హితవు పలికారు. మౌలానా అబ్దుల్లా బాఖవి మాట్లాడుతూ ఖుర్ఆన్ ప్రజల జీవితంలో వెలుగు నిలుస్తుందని ఉద్ఘాటించారు. మదరసాకి 80 మంది పిల్లలు క్రమం తప్పకుండా హాజరవుతారని తెలిపారు. జమాఆతె ఇస్లామీ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ పాఠశాలలో చదువుతూ ఉదయం సాయింత్రం పార్ట్ టైమ్ నూరాని మదరసాలో ఖుర్ఆన్ వ్యాకరణం బద్ధంగా చదువుతూ పూర్తి చేసిన విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు వాళ్ళ చదువుకు బాధ్యత వహించిన మౌలానా అబ్దుల్లా గారిని అభినందించారు. రమజాన్ నెలను పూర్తిగా ఆస్వాదించాలని, రమజాన్ నెలలో ఒదిగి ఉండాలన్నారు. రమజాన్ ఉపవాసాలు శాస్త్రియ ప్రయేజనాలు గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉపవాసాలు ఉంటున్నారని, ముస్లింలు పై విధిగా ఉన్న యోజనాలు తప్పక ఉండాలని యువతకు కోరారు. అనంతరం విద్యార్థులకు ఖుర్ఆన్ అనువాద గ్రంధం ప్రశంసా పత్రం అబ్దుల్ సమద్, మౌలానా అబ్దుల్ ఖదీర్ ఉమ్రీ, నూరాని మస్జిద్ కమిటి అధ్యక్షులు షేర్విని సలాం ఖాన్ చేతులు మీదుగా ప్రదానం చేసారు. కార్యక్రమంలో మస్జిద్ కమిటి కార్యదర్శి ఇలియాస్ ఖాన్, జేఐహెచ్ ఏరియా నాజిం నవాజ్ ఖాన్, జమాత్ సభ్యులు మోమీన్ గౌస్, అబ్దుల్ ఖాదర్ జీలాని, ఫయాజ్ , జకరియ,ముజాహీద్, యూనూస్,అలీం, సలీం, అబ్బాస్ అలీ, ప్రముఖులు ఐటా అధ్రక్ష కార్యదర్శులు సలీం, ఇర్ఫాన్, ఇస్మాయిల్ పీర్, సుల్తాన్, మహిళలు, కార్యకర్తలు , విద్యార్ధుల తలిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖులు మౌలానా అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ సమద్, సలాం ఖాన్, మౌలానా అబ్దుల్లా భాఖవిని సన్మానించారు.

0
169 views