logo

జి.ఎస్.ఆర్.ఆసుపత్రిలో నెల రోజుల పాటు ఎముకలు,కీళ్ళ ఉచిత ఓ.పి. వైద్య సేవలు.

నంద్యాల (AIMA MEDIA): పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఫిబ్రవరి 18వ తేదీ నుండి వచ్చే నెల రంజాన్ పండుగ వరకు స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న జి ఎస్ ఆర్ ఆసుపత్రిలో ప్రముఖ ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ మహమ్మద్ రఫీ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలందరికీ ఉచిత ఓపి వైద్య సేవలు అందిస్తారని. ఈ ఉచిత వైద్య సేవల పోస్టర్స్ ను సోమవారం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మహమ్మద్ రఫీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరీఫా బాను పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని డాక్టర్ మహమ్మద్ రఫీ ఉచిత వైద్య సేవలు నెలరోజులపాటు అందించడం ప్రశంసనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు.నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో పలువురు వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు.

0
200 views