logo

జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ గౌరవ శ్రీ సుంకర శ్రీనివాస్ గారి*

*జనసేన నేత సుంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కడప జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం – కార్యకర్తల నమ్మకమే శక్తిగా నిలిచిన కడప జిల్లా జనసేన, సుంకర శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఐక్యత, భరోసా, ప్రేరణ*

ఉమ్మడి కడప జిల్లా, కడప, 14-02-2026:

కడప జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన "కడప జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం" జిల్లా రాజకీయాల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. *జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ గౌరవ శ్రీ సుంకర శ్రీనివాస్ గారి* అధ్యక్షతన జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు హాజరయ్యారు. కార్యాలయం మొత్తం జనసేన నినాదాలతో, కార్యకర్తల ఉత్సాహంతో ఉప్పొంగిపోయింది.

ఈ సమావేశంలో సుంకర శ్రీనివాస్ గారు దీర్ఘంగా, లోతుగా, బాధ్యతాయుతంగా మాట్లాడారు. జనసేన పార్టీ తనకు ఒక హోదా మాత్రమే కాదని, కార్యకర్తల నమ్మకమే తన అసలైన బలం అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, *జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి* సిద్ధాంతాలు, త్యాగపూరిత నాయకత్వం ప్రేరణగా తీసుకుని కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పార్టీ జెండాను భుజాన మోసారని గుర్తు చేశారు. అలాంటి కార్యకర్తల కోసం నిలబడటమే తన బాధ్యత అని, వారి సమస్యలు, వారి భావోద్వేగాలు, వారి ఆశలు అన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను తాను గౌరవంగా స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు

జిల్లాలో జనసేన పార్టీని బలంగా నడిపించాలంటే ముందుగా సంస్థాగత బలోపేతం అవసరమని సుంకర శ్రీనివాస్ గారు స్పష్టంగా తెలిపారు. కార్యకర్తకు గౌరవం, గుర్తింపు, భద్రత ఉన్నప్పుడే పార్టీ ప్రజల్లో బలంగా నిలబడుతుందని చెప్పారు. కష్టపడే కార్యకర్తను పక్కన పెట్టే పరిస్థితి జనసేనలో ఎప్పటికీ ఉండదని, న్యాయం, సమానత్వం, గౌరవమే తన నాయకత్వానికి పునాది అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను, అభిప్రాయాలను ఏకస్వరంగా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో కార్యకర్తల సమక్షంలో మూడు కీలక తీర్మానాలను అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తీర్మానాలను కార్యకర్తలు స్పష్టంగా సుంకర శ్రీనివాస్ గారికి తెలియజేయగా, వాటిని అధిష్టానం వరకు చేర్చే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు.

1. మొదటిగా పార్టీ జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు సంస్థాగతంలో బలోపేతం దిశగా అధిష్టానం త్యరితగతిన తగు చర్యలు తీసుకోవాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉన్నప్పుడే జనసేన ప్రజల్లో బలంగా ముందుకు సాగుతుందని, అందుకే కమిటీల పునర్వ్యవస్థీకరణ, క్రియాశీల కార్యకర్తలకు బాధ్యతలు అత్యవసరమని ఈ తీర్మానంలో స్పష్టం చేశారు.

2. రెండవదిగా NDA కూటమి ప్రభుత్వంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పదవులు, బాధ్యతలలో పొత్తు ధర్మం ప్రకారం జనసేన పార్టీకి తగిన వాటా దక్కాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ తీర్మానించారు. ఈ వాటా 15 శాతం లేదా 20 శాతం లేదా 30 శాతం అనే అంశాన్ని పూర్తిగా అధిష్టానం నిర్ణయానికి వదిలేస్తూ, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి న్యాయమైన గౌరవం, సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

3. మూడవదిగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి, వైసీపీ ప్రభుత్వ కాలంలోనూ ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా జనసేన జెండాను భుజాన మోసి గట్టిగా నిలబడ్డ వారికి అర్హతలు, అనుభవం మేరకు పార్టీ బాధ్యతలలో, నామినేటెడ్ పదవులలో తగిన న్యాయం చేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ తీర్మానించారు. త్యాగం చేసిన కార్యకర్తకు న్యాయం జరగకపోతే పార్టీ బలహీనమవుతుందని, కార్యకర్తకు న్యాయం జరిగితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ తీర్మానంలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ మూడు తీర్మానాలను కార్యకర్తలు సుంకర శ్రీనివాస్ గారికి తెలియజేయగా, ఆయన స్పందిస్తూ ఈ తీర్మానాలన్నింటినీ సంపూర్ణంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, కార్యకర్తల భావోద్వేగాలు, ఆకాంక్షలు ఎక్కడా తగ్గకుండా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల నమ్మకానికి తగిన విధంగా నిలబడతానని ఆయన స్పష్టం చేశారు.

“ఈ సమావేశంలో కార్యకర్తలు వ్యక్తం చేసిన ప్రతి మాట, ప్రతి భావన నా హృదయాన్ని తాకింది. మీరు చెప్పినది కేవలం తీర్మానాలు కాదు… ఇవి కార్యకర్తల ఆశలు, ఆకాంక్షలకు సంకేతాలు అని. జిల్లాలో జనసేన పార్టీకి బలం నేనే కాదు – మీరందరే. మీ నమ్మకమే నా శక్తి, మీ ధైర్యమే నా ధైర్యం” అని అన్నారు.

“జిల్లా నాయకత్వంగా మీకు నేను ఇచ్చే భరోసా ఒక్కటే – మీరు ఎవరూ ఒంటరిగా లేరు. కష్టపడే ప్రతి కార్యకర్త నా దృష్టిలో ఉన్నాడు అని, “జనసేన పార్టీ అంటే పదవుల కోసం కాదు… త్యాగం కోసం, న్యాయం కోసం, భవిష్యత్ తరాల కోసం జరిగే ఉద్యమం. ఆ ఉద్యమానికి ప్రాణం పోసింది కార్యకర్తే అని. జిల్లా నాయకుడిగా, ఈ జిల్లాకు బాధ్యత వహిస్తున్న వ్యక్తిగా, మీ ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకుని పరిష్కారం దిశగా నడుస్తాను” అని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ కడప జిల్లా జనసేన పార్టీకి సుంకర శ్రీనివాస్ గారు పెద్ద దిక్కుగా ఉన్నారని, అందరినీ కలుపుకుని ముందుకు నడిపిస్తున్న నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఉందని ప్రశంసించారు. కష్టకాలంలోనూ కార్యకర్తల వెంటే నిలబడి, వారి సమస్యలను తన సమస్యలుగా తీసుకునే నాయకుడు సుంకర శ్రీనివాస్ గారేనని వారు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

మొత్తంగా ఈ విస్తృత స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం కడప జిల్లాలో జనసేన పార్టీ భవిష్యత్ ప్రయాణానికి స్పష్టమైన దిశను చూపిన వేదికగా నిలిచింది. కార్యకర్తల ఆశలు, ఆకాంక్షలు, తీర్మానాలకు ప్రతినిధిగా నిలిచిన ఈ సమావేశం, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో సుంకర శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచిందని, ఆయన నాయకత్వంలో కడప జిల్లా జనసేన పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని కలిగించిందని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, సీనియర్ నాయకులు చిరంజీవి యువత అధ్యక్షులు పండ్ర రంజిత్ కుమార్, కడప నగర అధ్యక్షులు బొరెడ్డి నాగేంద్ర, జనసేన పార్టీ లీగల్ సేల్ తోట బాలసుబ్రమణ్యం, బొగ్గుల గుర్రప్ప, జనసేన వీర మహిళా రెడ్డి రాణి, కమలాపురం నియోజకవర్గం పిఓసి వేణుగోపాల్ రెడ్డి, గౌస్ లాజం బద్వేల్ నాయకులు మురళి, నందకిషోర్, ఈశ్వర్ రెడ్డి, మైదుకూరు నాయకులు కృష్ణమూర్తి, శ్రీరామ్ వంశీ, జమ్మలమడుగు నాయకులు, నాగార్జున, జగదీష్, ప్రొద్దుటూరు నాయకులు జిల్లాని భాష, సంజీవ, మంచి శివ, పులివెందుల నాయకులు భరత్, దాసర రవి, రమణ, హరి, ఆంజనేయులు, రాజంపేట నాయకులు రామ శ్రీనివాసులు, కోలాటం హరి, కళ్యాణ్ మరియు శేషు రాయల్, జిటి కుమార్, అనిల్, శరత్, వెంకటేష్, తరుణ్, చార్లెస్, భరత్ , తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

—మీడియా కోఆర్డినేటర్, జిల్లా జనసేన పార్టీ కార్యాలయం, ఉమ్మడి కడప జిల్లా.

0
792 views