
మర్రి నరేష్ ప్రధాన వార్త : రిపోర్టర్లపై పోలీసులు దాడి చేసిన, బెదిరించిన, కొట్టిన, రిపోర్టర్ వెంటనే ఏం చేయాలి...?
ఒక రిపోర్టర్‌ను పోలీసు అధికారులు (కానిస్టేబుల్, ఎస్ఐ, లేదా సీఐ) స్టేషన్‌కు పిలిపించి బెదిరించినా, బహిరంగంగా బెదిరించిన, లేదా భౌతికంగా దాడి చేసినా, అది చట్టరీత్యా నేరం. వారిపై చర్యలు తీసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఆల్ ఇండియా మీడియా ద్వారా మీ ముందుకు
చట్టం ముందు అందరూ సమానులే ఒక అధికారి తన అధికార పరిధిని దాటి ప్రవర్తించినప్పుడు
చట్టపరమైన సెక్షన్లు BNS ప్రకారం
ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కింది సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు
సెక్షన్ 115(2) స్వల్ప గాయాలు చేయడం (గతంలో IPC 323)
సెక్షన్ 351 నేరపూరిత బెదిరింపులు (గతంలో IPC 506)
సెక్షన్ 198 అక్రమంగా నిర్బంధించడం (గతంలో IPC 342)
సెక్షన్ 127 అధికార దుర్వినియోగం చేస్తూ భయపెట్టడం
ఎక్కడ ఫిర్యాదు చేయాలి...?
పోలీసులే తప్పు చేసినప్పుడు, అదే స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఫలితం ఉండకపోవచ్చు అప్పుడు మీరు ఈ దశలు అనుసరించాలి
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
జిల్లా ఎస్పీ (SP) లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP) కు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి
పోలీస్ కంప్లైంట్ అథారిటీ (PCA) పోలీసుల దుష్ప్రవర్తనపై విచారణ జరిపే ప్రత్యేక సంస్థ ఇది. ఇక్కడ ఫిర్యాదు చేస్తే సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు
కోర్టు ద్వారా (Private Complaint) స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయవచ్చు కోర్టు ఆదేశాల మేరకు వారిపై FIR నమోదు చేయాల్సి ఉంటుంది
ముఖ్యమైన ఆధారాలు
కేసు బలంగా ఉండాలంటే కిందివి సేకరించాలి
మెడికల్ రిపోర్ట్ దాడి జరిగిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయాల వివరాలతో మెడికల్ సర్టిఫికేట్ (MLC) తీసుకోవాలి
సాక్ష్యాలు: స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లేదా ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర సాక్ష్యాల వివరాలు
కాల్ రికార్డింగ్స్: మిమ్మల్ని ఫోన్ ద్వారా బెదిరించి పిలిపిస్తే ఆ రికార్డింగ్స్ భద్రపరుచుకోవాలి.
మానవ హక్కుల కమిషన్ (NHRC/SHRC)
ఒక జర్నలిస్టుపై దాడి జరగడం అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే. కాబట్టి, రాష్ట్ర లేదా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆన్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు
విలేకరుల రక్షణ
మీరు ప్రెస్ ఐడి కార్డు కలిగి ఉన్నప్పుడు, విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్‌ను అడ్డుకోవడం లేదా కొట్టడం అనేది సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం తీవ్రమైన నేరం. మీడియా సంఘాల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.