సూరారం ట్రాఫిక్ PS ముందు కారు బీభత్సం
సూరారం ట్రాఫిక్ PS ముందు కారు బీభత్సం
సూరారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతున్న ఓ వ్యక్తి అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు(TS08 JC 3960) ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి క్షతగాత్రులను 108 ద్వారా హాస్పిటల్కు తరలించారు.