logo

శ్రీశైలం పాతాళ గంగ వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్.

*పాతాళ గంగ వద్ద ఏర్పాటుచేసిన బందోబస్తును ఏర్పాట్లను పరిశీలన.....*

*మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలి....*

*నదిలో బోటు నడిపే నిర్వాహకులు తప్పనిసరిగా భద్రత ప్రమాణాలు పాటించాలి.....*

*ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి....*

*నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు...*
*జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS *
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో పాతాళగంగ పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన బందోబస్తును *జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాతాళగంగ మెట్ల మార్గం ద్వారా స్వయంగా పర్యటిస్తూ సంబంధిత అధికారులకు నిర్వహించవలసిన విధులపై పలు సూచనలు చేయడం జరిగింది.పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశం వరకు చేరుకున్న అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడుతూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మెట్ల మార్గం ద్వారా భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని మరియు పుణ్యస్నానాలు ఆచరించు భక్తులు అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళ్లరాలని శబ్ద యంత్రం (మైక్)ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు.
బోట్ల ద్వారా ప్రయాణికులను విహారయాత్రకు తీసుకువెళ్లే బోటు నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలి.
ప్రతి ఒక్క ప్రయాణికుని భద్రత ,రక్షణ దృష్టిలో ఉంచుకోవాలి. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది

0
3446 views