నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి శ్రీశైలం పాదయాత్ర విజయవంతం కావాలి... ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి లోక కళ్యాణార్థం చేపట్టిన శ్రీశైలం పాదయాత్ర లో భాగంగా శనివారం నాడు వెంకటాపురం గ్రామానికి చేరుకోవటంతో, ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ బైరెడ్డి శబరి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని పలు ప్రజా సమస్యలపై వారు చర్చించుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాల్ రత్నమయ్య, ముళ్ళ షరీఫ్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.