logo

గులాబి కోటలో హస్తం జెండా. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభంజనం.

AIMA న్యూస్ బ్యూరో హైదరాబాద్.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుని తన జైత్రయాత్రను కొనసాగించింది. అసెంబ్లీ ఎన్నికల విజయం గాలివాటం కాదని, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఈ విజయంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.శభాష్ రేవంత్ రెడ్డి
ప్రభుత్వం ఏర్పడిన తక్కువ కాలంలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు, పారదర్శక పాలన అందిస్తున్న తీరుకు ఓటర్లు పట్టం కట్టారు. పట్టణ ఓటర్లు సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రదర్శిస్తారనే వాదనను తిప్పికొడుతూ, రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపేలా చేశాయి.రేవంత్ వ్యూహానికి విపక్షాలు చిత్తు
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా, తనదైన శైలిలో అభివృద్ధి మంత్రాన్ని జపించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో సఫలమయ్యారు.
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అంతా తానై నడిపించి, ప్రతిపక్షాల కోటలను బద్దలు కొట్టారు.ఇది రేవంత్ రెడ్డి కష్టానికి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి దక్కిన విజయం.
ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ముఖ్యంగా విపక్షాల కంచుకోటలుగా భావించే మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. ఈ ఫలితాలు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.ఈ గెలుపు కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. ప్రతిపక్షాల విమర్శల మధ్యే తన పనితీరుతో సమాధానం చెబుతూ, మున్సిపల్ పోరులో కాంగ్రెస్ రథసారధిగా ఆయన విజయం సాధించారు.

2
1256 views
1 comment  
  • Adinarayana Thugonda

    ఇది తెలంగాణ న్యూస్ మీరు ఏపీ న్యూస్ దాంట్లో రాశారు