logo

బడ్జెట్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ కు 500 కోట్లు కేటాయించాలి... జిల్లా అధ్యక్షుడు కె. పి. వి. సుబ్బారావు


బ్రాహ్మణ సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ కు
500 కోట్లు కేటాయించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షుడు
కె. పి. వి. సుబ్బారావు ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గత సంవత్సరం బడ్జెట్ లోపాలకమండలి లేకపోయినా 345 కోట్లు కేటాయించారనిప్రస్తుతం పాలక మండలి
ఉన్నందువలన 500 కోట్లు కేటాయించాలని కోరారు. గతములో మాదిరిగా కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఋణాలు, గరుడ పథకం మంజూరు చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బ్రాహ్మణులకు ఆర్థిక సహా కారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే కార్పొరేషన్ బి. సి. శాఖ నుoడి దేవాదాయ శాఖకు మార్చాలని పేర్కొన్నారు. పాలక మండలి కూడా వెంటనే ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై ఒక వినతి ఇవ్వాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వంపై బ్రాహ్మణులు చాలా ఆశలు
పెట్టుకొన్నారని ధూపదీప నైవేద్యం తో పాటు దీని పైన కూడా దృష్టి పెట్టాలని నంద్యాల జిల్లా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు కె. పి. వి. సుబ్బారావు కోరారు.

7
305 views