logo

THANK YOU CM SIR" మరియు "THANK YOU BAVYA HEALTH SERVICES PRIVATE LIMITED" అనే


ఏపీ 108 అంబులెన్స్ సర్వీస్ లో ఉద్యోగులుగా పనిచేస్తున్న ఈ.యం.టి మరియు పైలెట్ లకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పటికే ఉన్న ఉద్యోగి యొక్క జీతం కు అదనంగా ఉద్యోగికి నెలకు 2000 రూపాయలను పెంచడం తో బాటు,5సం",10సం" సర్వీస్ పూర్తి చేసుకొన్న ఉద్యోగులకు ఆటోమేటిక్ స్లాబ్ అప్గ్రేడేషన్ చేయవలెనని నిర్ణయించడం ద్వారా వారికి మరింత ఆర్థిక వెసులుబాటును అందించారు.
108 అంబులెన్స్ ఉద్యోగులకు అందించిన ఆర్థిక పెంపుదలను ఉద్యోగులు అయిన ఈ.యం.టి మరియు పైలెట్లు అందరూ హర్షిస్తున్నారు.ఈ నెల నుండి స్లాబ్ అప్గ్రేడ్ చేసిన జీతాలు చేతికి అందడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అందరూ ఆంధ్రప్రదేశ్ 108 సర్వీస్లో ఏకైక సంఘం అయిన ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ (H-138 CITU అనుబంధం)ఉద్యోగ సంఘం ద్వారా "THANK YOU CM SIR" మరియు "THANK YOU BAVYA HEALTH SERVICES PRIVATE LIMITED" అనే పాంప్లేట్ లను విధులు నిర్వహించే వాహనం ముందు ప్రదర్శిస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము.ఈ సందర్భంగా మేము చేస్తున్న విధినిర్వహణలో మరింత మెరుగైన సేవలు ఆపదలో ఉన్నవారికి అందించి ప్రభుత్వానికి మరియు భవ్య కంపెనీ వారికి మంచి పేరును తీసుకువస్తామని ఇందుమూలంగా తెలియచేస్తున్నాము.

0
0 views