logo

ఢిల్లీలో తెలుగు UPSC విద్యార్థులకు ఉచిత లైబ్రరీ ప్రారంభం.

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం. ఢిల్లీలో తెలుగు UPSC (సివిల్ సర్వీసెస్) ప్రిపేరేషన్ చేసే విద్యార్థులకు ఉచిత లైబ్రరీని ప్రారంభించారు. ఆల్ ఇండియా జ్యోతిబా ఫూలే అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఢిల్లీలో సుమారు 10 లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. వీరిలో రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. "వీరంతా మన తెలుగు విద్యా శ్రమల ఫలితంగా ఈ గొప్ప స్థాయిలకు చేరుకున్నారు" అని పోతల ప్రసాద్ నాయుడు తెలిపారు.పోతల ప్రసాద్ నాయుడు ఢిల్లీ విశ్వవిద్యాలయం, భారతీయ విశ్వవిద్యాలయాలు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు UPSC అభ్యర్థుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. "విద్యే అభివృద్ధికి మూలం. నా జీవితంలో 100 మంది IAS, IPS, IFS అధికారులు, 100 న్యాయవాదులు, 100 డాక్టర్లు, 100 వ్యవసాయ శాస్త్రవేత్తలు, 100 ఇంజనీర్లను తయారు చేయాలన్నది నా ఆశయం" అని ఆయన స్పష్టం చేశారు.ఈ లైబ్రరీ తెలుగు UPSC విద్యార్థులకు పెద్ద బహుమతి. "ఇది వారి ప్రిపేరేషన్‌ను మరింత సులభం చేస్తుంది. అందరూ ఉపయోగించుకోవాలి" అని పోతల ప్రసాద్ నాయుడు పిలుపునిచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రతిభ కలిగిన ప్రతి విద్యార్థిని వారి విద్యకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమని తెలిపారు. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

26
933 views