logo

ఆంధ్రభోజుడిగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించండి....

ఆంధ్రభోజుడిగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించండి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన గొప్ప పరిపాలకుల్లో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు . ఈయన కాలమంతా సాహిత్య ,కళ సాంస్కృతిక స్వర్ణ యుగంగా సాగిందనీ మనం చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్యానికి గొప్ప పోషణ అందించినందుకు ఆయనను ఆంధ్రభోజుడుగా పేరుపొందారు. అలాంటి సమర్థవంతమైన పరిపాలన ,ప్రజా సంక్షేమం ,వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించిన మహోన్నతమైన రాజు శ్రీకృష్ణదేవరాయలు అని ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహించాలని విజయవాడ అమరావతిలో నిర్వహించిన శాసన సభ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించి దక్షిణ భారతదేశ చరిత్రలో గొప్ప పరిపాలికుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీకృష్ణదేవరాయలు మృతి చెంది 600 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నాడని ఎమ్మెల్యే పల్లె సింధూర కొనియాడారు. అలాంటి గొప్ప పరిపాలకుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కోరారు.

15
272 views