logo

ఐ ఐ ఐ టి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తిలో ఐ ఐ ఐ టి ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
ముఖ్యమంత్రి తో చర్చించి పుట్టపర్తిలో త్రిబుల్ ఐటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చలువ వల్ల ప్రసిద్ధి గాంచిన పుట్టపర్తికి ప్రపంచ చరిత్ర పటంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రమైన పుట్టపర్తి ప్రాంతంలో ఐ ఐ ఐ టి ఏర్పాటు చేసేందుకు పుట్టపర్తి లో అన్ని వసతులతో కూడిన సదుపాయాలు ,మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లాతో పాటు అనంతపురం కర్నూలు ,చిత్తూరుమదనపల్లి,నంద్యాల , అన్నమయ్య,తిరుపతి జిల్లాలలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందనీ విజయవాడ అమరావతిలో గురువారం జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా ఒంగోలు ట్రిబుల్ ఐటీ, ఇడుపులపాయ శ్రీకాకుళం నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థులు చదువుతున్న ప్రాంతంలోనే ఆయా కోర్సులు పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా కోరారు. ఒంగోలు లో ఐ ఐ ఐ టి చదువుతున్న విద్యార్థులు ఇడుపులపాయకు,శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీ విద్యార్థులు నూజివీడు వచ్చి ఆయా కోర్సులు పూర్తిచేసుకుని తిరిగి ఆయా అదే ప్రాంతానికి వెళ్లి బీటెక్ మిగతా కోర్సులు కొనసాగించేలా ఇబ్బందులు ఉన్నాయని దీని వల్ల ఆయా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎంతో శ్రమ తోపాటు ఎంతో ఇబ్బందికరంగా పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. చదివే క్యాంపస్ లోనే ఆయా కోర్సులు పూర్తిచేసేలా విద్యా శాఖ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా విన్నవించారు.

అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలోఉన్న ఆరు మండలాలకు కలిపి కేవలం బుక్కపట్నంలో మాత్రమే ఒకే డిగ్రీ కళాశాల ఉందని ఇది 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంత శాసనసభ్యులు అప్పటి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక చొరవతో అప్పటి ప్రభుత్వం రూ. 3 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. మొదటి విడతలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేయడంతో కొంతవరకు డిగ్రీ కళాశాల పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి ఈ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులకు నిధులు ఇవ్వకపోవడంతో కళాశాల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందనీ తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన డిగ్రీ కళాశాల నిర్మాణం పనులు చేపట్టే విధంగా సకాలంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి త్వరగా వాటిని పూర్తి అయ్యేలా చూడాలని ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును కోరారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు స్పందిస్తూ, పుట్టపర్తి లో త్రిబుల్ ఐటీ ఏర్పాటుకు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి హామీ ఇచ్చారు.
అదేవిధంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు చెప్పిన వాటిలో రాష్ట్రంలో ఐ ఐ ఐ టీ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని ,వీటిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో నిధుల మంజూరు విషయంపై చర్చించినట్లు మంత్రి నారా లోకేష్ బాబు పేర్కొన్నారు.ఏ క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థులు అదే క్యాంపస్ లో ఆయా కోర్సులు పూర్తిచేసేలా నిధులు కేటాయింపు తోపాటు ప్రభుత్వం వీటిపై తప్పకుండా పూర్తి బాధ్యత తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ బాబు తెలిపారు.

0
167 views