logo

సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదు....

*సారూ జరా గార్లదిన్నె గ్రామానికి చెందిన లక్ష్మీకాంతమ్మ కు న్యాయం చేయరాదు*

*సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న*????

సాక్షాత్తు పోలీసు శాఖలో ఏ ఎస్ ఐ విధులు నిర్వహిస్తున్న నాగన్న ఆదినారాయణ కు సపోర్ట్ చేయడంతో లక్ష్మీకాంతమ్మ పై మరింత దూకుడుగా దాడి...????

లక్ష్మీకాంతమ్మకు ఎక్కడ దక్కని న్యాయం...?????

చివరికి ఆత్మహత్య శరణం అంటూ ఆవేదన....?????

ఏ అన్న అయినా తన తోబుట్టు బాగుండాలే, పసుపు కుంకుమలతో పిల్లాపాపలతో బాగుండాలి అనుకుంటాడు. జర ఇక్కడికి రండి చూద్దాం అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండల కేంద్రంలో లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలుకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది అయితే నిరుపేద లక్ష్మీకాంతమ్మ తన ముగ్గురు బిడ్డలను పోషించుకుంటూనే ఉండటానికి ఒక గూడు అవసరమని ఆ ఇల్లును కట్టుకుంది లక్ష్మీకాంతమ్మ అయితే తన సొంత అన్న ఆదినారాయణ సాక్షాత్తు తన తోడబుట్టిన చెల్లలు ఇంటికే కన్నేసాడు,గతంలో లక్ష్మీకాంత మ్మను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ తాను అమ్మక పోయిన అమ్మినట్టు ఫోర్జరీ సంతకాలతో తోబుట్టువ లక్ష్మీకాంతమ్మను తీవ్ర అన్యాయం చేశాడు.ఇది ఇలా ఉండగా లక్ష్మీకాంతమ్మ అన్న ఆదినారాయణ కు కొందరు వ్యక్తులు సపోర్ట్ చేస్తూ తన ఇంటికి సంబంధించిన పత్రాలను ఫేక్ డాక్యుమెంట్స్ గా చిత్రీకరిస్తూ చివరకు సాక్షాత్తు ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు ఆ వ్యక్తులు. చివరికి లక్ష్మీకాంతమ్మను ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా ఇది మా ఇల్లు అంటూ ఇంటిలో ఉన్న సామాగ్రిను లక్ష్మీకాంతమ్మను, తన బిడ్డలను బయటకు గెంటేశారు అన్న ఆదినారాయణ,వినడానికి విచిత్రంగా ఉన్న తల దాచుకోవడానికి ఎక్కడా చోటు లేక ఇంకా గుడిసెలలో కొద్దిరోజులు బంధువుల ఇళ్లల్లో కొద్దిరోజులు ఇంకా చెప్పుకోలేని చోట ఉంటూ జీవనం సాగిస్తున్నారు లక్ష్మీకాంతమ్మ ఎన్నో చెప్పుకోలేని మాటలు తన దగ్గర ఉన్నాయని తన అన్న లా నేను దిగజారి మాట్లాడలేనని స్పష్టం చేశారు లక్ష్మీకాంతమ్మ. అయితే ఎన్నోసార్లు రెవిన్యూ అధికారులకు చెప్పిన, అటు పోలీసు అధికారులకు చెప్పిన, కోర్టులకు సైతం ఎక్కిన ఎక్కడా తనకి న్యాయం జరగకుండా చేస్తున్నాడు అన్న ఆదినారాయణ, చివరకు సాక్షాత్తు జిల్లా పోలీస్ అధికారి అయిన జగదీష్ కు తన గోడును వెల్లబోసుకున్నారు. అది నా ఇల్లు అంటూ తన దగ్గర ఉన్న అన్ని పత్రాలను సైతం నేడు సోమవారం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తన గోడను చెప్పుకున్నారు. మరి అధికారులు లక్ష్మీకాంతమ్మకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి.....?????

9
286 views