
మర్రి నరేష్ ప్రత్యేక కథనం : మంచిర్యాల జిల్లా జన్నారం అడవులకు ప్రకృతికి పెట్టింది పేరు అందులో ఇందన్ పల్లి గ్రామం తనదైన భౌగోళిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
ఇందన్ పల్లి గ్రామం కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది జన్నారం వెళ్లే దారిలో ఈ గ్రామం ఒక ముఖ్యమైన కూడలిలా ఉంటుంది ఇక్కడి నుండే దట్టమైన అడవి ప్రాంతం ప్రారంభమవుతుంది ఇది ప్రకృతి ప్రేమికులకు చాలా ఇష్టమైన ప్రాంతం
ఇందన్ పల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది
ఈ ఆలయం ఎంతో పురాతనమైనది స్థానికులకు ఎంతో సెంటిమెంట్
ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ నిర్వహించే కళ్యాణోత్సవం జాతర చుట్టుపక్కల గ్రామాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది
గ్రామం చుట్టూ అడవి ఉండటంతో తరచుగా వన్యప్రాణుల సంచారం కనిపిస్తుంటుంది అటవీ శాఖ వారి కార్యాలయాలు మరియు చెక్ పోస్టులు కూడా ఇక్కడ కీలకంగా ఉంటాయి
వ్యవసాయం: ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు వరి, పత్తి మరియు మొక్కజొన్న ఇక్కడ పండే ప్రధాన పంటలు
పర్యాటక కనెక్టివిటీ
పర్యాటకులు నిర్మల్ లేదా మంచిర్యాల నుండి కడెం ప్రాజెక్ట్ లేదా జన్నారం అడవులకు వెళ్లాలంటే ఇందన్ పల్లి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా ఉండే ఎత్తైన చెట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్నిస్తాయి
చారిత్రక ఆధారాల ప్రకారం నిజాం పరిపాలన కాలంలో నిర్మల్ నుండి మంచిర్యాల చెన్నూర్ ప్రాంతాలకు వెళ్లడానికి ఈ గ్రామం ఒక ముఖ్యమైన విశ్రాంతి ప్రాంతంగా ఉండేది అప్పట్లో దట్టమైన అడవి గుండా ప్రయాణించే వారు ఇందన్ పల్లి వద్ద ఆగి సేదతీరేవారని చెబుతుంటారు
'ఇందన్ పల్లి' పేరు వెనుక కథ
స్థానిక కథనాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు కేవలం అటవీ ఉత్పత్తులకు కట్టెలకు (ఇంధనం) నిలయంగా ఉండేది అడవి నుండి సేకరించిన కట్టెలను లేదా ఇంధనాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే కేంద్రంగా ఉన్నందున కాలక్రమేణా దీనికి 'ఇందన్ పల్లి' అనే పేరు వచ్చిందని కొందరు పెద్దలు చెబుతుంటారు
ఈ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కేవలం భక్తి కేంద్రమే కాదు అది ఒక చారిత్రక కట్టడం కూడా
ఈ ఆలయ నిర్మాణం లోని శిల్పకళ రాతి కట్టడాలు ఆ ప్రాంత పాత కాలపు నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి
ముఖ్యంగా అడవి మధ్యలో ఇలాంటి ఆలయం ఉండటం వల్ల పూర్వం ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారని స్థానిక నమ్మకం
జన్నారం మండలం మొత్తం ఆదివాసీల సంస్కృతికి నిలయం ఇందన్ పల్లి గ్రామం కూడా గోండు కొలాం తెగల ప్రజల ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉంది అటవీ దేవతలను పూజించడం ప్రకృతిని గౌరవించడం ఇక్కడి చరిత్రలో అంతర్భాగం
అటవీ పరిరక్షణలో పాత్ర
బ్రిటిష్ నిజాం కాలం నుండి ఈ ప్రాంతం అటవీ శాఖ పర్యవేక్షణలో ఉండేది ఈ గ్రామం చుట్టూ ఉన్న అడవిలో టేకు కలపకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండేది ఆ కాలంలోనే ఇక్కడ అటవీ శాఖకు సంబంధించిన క్వార్టర్లు పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అని వినికిడి...?