స్ఫూర్తిదాయకమైన పని తీరుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలి
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఫిబ్రవరి 11న జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ నిర్వహించి, దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎస్., పోక్సో, అట్రాసిటీ, మిస్సింగు, రోడ్డు ప్రమాద కేసులను, సోషల్ మీడియా కేసులను, హిస్టరీ షీట్లు ను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ స్పూర్తిదాయకమైన పని తీరుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖ వినియోగిస్తున్న టెక్నాలజీ పట్ల పోలీసు సిబ్బంది, అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. నేరాలు జరగకుండా రాత్రి గస్తీని, పెట్రోలింగును ముమ్మరం చేయాలని, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ రోజూ ఆర్టీసి కాంప్లెక్సు, రైల్వే స్టేషను, ముఖ్యమైన జంక్షన్లులోను, లాడ్జిల్లోను తనిఖీలు నిర్వహించాలన్నారు. పెండింగులో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన అన్ని రిప్లైస్ ను జిల్లా పోలీసు కార్యాలయంకు సకాలంలో పంపాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని, కేసుల దర్యాప్తులో మరియు నేరాలను కట్టడిచేసేందుకు సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలన్నారు. ఇకపై దర్యాప్తు చేపట్టే అన్ని కేసుల్లోను ఈ-సాక్ష్య యాప్ ను వినియోగించాలని, ఫోటోలను, వీడియోలను ఈ-సాక్ష్యలో నిక్షప్తం చేయాలన్నారు. కేసుల దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్లో అప్లోడు చేయాలని, అందుకు పోలీసు స్టేషను స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయంలోగా ఆయా న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. ప్రజలకు రహదారి, సైబరు, మహిళల భద్రత పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మైనరు డ్రైవింగు, హెల్మెట్ ధారణ, డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగుపై ప్రత్యేక దృష్టి పెట్టి, కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేరాలను నియంత్రించుటలో హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను ఎం.ఎస్.సి.డి.లతో తనిఖీ చేయాలన్నారు. నేరాలను నియంత్రించేందుకు పోలీసు స్టేషను పరిధిలో మరిన్ని ఎక్కువ సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వాణిజ్య సముదాయాల యజమానులు, అపార్టుమెంటు వాసులకు సిసి కెమెరాల ప్రాధాన్యతను వివరించి, స్వచ్ఛందంగా వారు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సమీక్షించి, ఆయా కేసుల్లో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గ్రామ స్థాయిలో గంజాయి సేవించే వారిని గుర్తించి, వారికి గంజాయిని విక్రయించే వారి వివరాలు రాబట్టి, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించాలని, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించేందుకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.
వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్డీపిఎస్, మిస్సింగు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్ఫోర్సుమెంటు కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేసారు. మిస్సింగు వ్యక్తులను ట్రేస్ చేయుటకు, నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్య రెడ్డి, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.