logo

రావివలసలో విషాదం: అప్పలనాయుడు చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం!


విజయనగరం జిల్లా బాడంగి మండలం రావివలసలోని అప్పలనాయుడు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు స్థానిక గ్రామానికి చెందిన అప్పచ్చిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం చెరువు వద్దకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0
211 views