logo

పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహనా సదస్సు.. డాక్టర్ ఎం సాయిబుచ్చారావు



వేలేరుపాడు :పాడి రైతులకు ఆదాయం రెట్టింపు చేసే భాగంగా పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ పెంటపాడు సహకారంతో గ్రామాల్లో ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎం సాయిబుచ్చారావు అన్నారు. దీనిలో భాగంగా బుధవారం నాడు మేడేపల్లి పంచాయతీ కోయమాదారం గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పాడి పశువుల ద్వారా ఆదాయమును రెట్టింపు ఎలా పొందాలో ఆధునిక యాజమాన్య పద్ధతులను డాక్టర్ ఎం సాయిబుచ్చారావు సహాయ సంచాలకులు పశు వైద్యశాల జీలుగుమిల్లి వివరించారు. ఈ శిబిరం ను డాక్టర్ డి ఎం నాయక్ ఈవో డిఎల్డిఏ పెంటపాడు వారు ప్రారంభించారు. ఈ శిబిర నిర్వహణ భవాని అశోక్ మరియు బౌ అండ్ యారో సంస్థ సభ్యులు క్రాంతి కుమార్ ,లక్ష్మీ నారాయణ ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ శేఖర్ దొర సహాయ సంచాలకులు జంగారెడ్డిగూడెం డాక్టర్ సాయిరాం ఇన్చార్జి పశువైద్యాధికారి వేలేరుపాడు డాక్టర్ అభిలాష్ పశువైద్యాధికారి సంచార పశు వైద్యశాల ఏవీవీ సత్యనారాయణ వి. ఎల్. ఓ, భవాని ఎల్.ఎస్. ఏ, ఎన్ రాజు ఎల్ ఎస్ ఏ , పశువైద్య సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. 60 పశువులకు గర్భకోశ చికిత్సలు 120 పశువులకు సాధారణ వైద్య చికిత్సలు 64 దూడలకు నిట్టల నివారణ మందులు ఉచితంగా అందించడం జరిగినది.

12
3976 views