logo

నవ్యనగర్‌లో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన కమిషనర్ ఏ.రామచంద్రరావు


విజయనగరం జిల్లా.రాజాం:

రాజాం టౌన్ 17వ వార్డులోని నవ్యనగర్ మూడవ లైన్లో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, టౌన్ క్లస్టర్ ఇంచార్జ్, విజయనగరం పార్లమెంట్ బీసీ సెల్ అధికార ప్రతినిధి మరిపి జగన్ మోహన్ రావు పాల్గొన్నారు.
అలాగే రాజాం టౌన్ యూనిట్ ఇంచార్జ్‌లు గంది గోపి, అద్దంకి గోపి, తూతిక చిట్టిబాబు, నవ్యనగర్ ప్రాంత ప్రజలు, టిడిపి కార్యకర్తలు, మహిళలు, స్థానిక నాయకులు, కాంట్రాక్టర్ మరియు మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు.
సీసీ రోడ్డు నిర్మాణంతో ప్రాంతంలో రాకపోకలకు సౌలభ్యం కలుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

12
1577 views