ఆర్థిక అక్షరాస్యతతోనే సరైన ఆర్థిక నిర్ణయాలు*
: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*.....
*ఆర్థిక అక్షరాస్యతతోనే సరైన ఆర్థిక నిర్ణయాలు*
- *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
- *అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం సాయంత్రం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుండి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు.*
- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతతోనే సరైన ఆర్థిక నిర్ణయాలు సాధ్యమని, ఈ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు మరియు డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డిఎం) జి.నరేష్ రెడ్డి తెలిపారు.*