
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి*జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*.....
*బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి*జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
-*బాల్య వివాహ రహితంగా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లో ఐసీడీఎస్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ విముక్త భారత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు నిర్వహిస్తే ఎదురయ్యే చట్టపరమైన శిక్షలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.*
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ అరుణ కుమారి, జిల్లా బాలల పరిరక్షణాధికారి ఆర్.మంజునాథ, డీఆర్‌డీఏ పీడీ శైలజ, ఓఎసి శాంతమ్మ, డివియాక్ట్ ఉమా, నర్మదా ఆర్డిటి ఆదినారాయణ, భానుజ, అలాగే డీసీపీయూ నుంచి సమీర్, వసంతలక్ష్మి, కమలాక్షి, వెంకట్, చైల్డ్ హెల్ప్‌లైన్ ఇర్ఫాన్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.*