logo

కడప ఉక్కు పరిశ్రమతోనే రాయలసీమ పారిశ్రామిఖభివృద్ధి

కడప ఉక్కు పరిశ్రమతోనే రాయలసీమ పారిశ్రామిఖభివృద్ధి

ఇప్పటికి వందల కోట్లు ఖర్చు పెట్టిన కడప బెంగళూరు రైల్వే లైన్ పైన పాలకుల నిర్లక్ష్యం..!!!

వైద్యపరంగా కీలకమైన పులివెందుల మెడికల్ కాలేజీ ని ప్రయివేటికరణ ఆపాలి...

రాయలసీమ సమగ్రాభివృద్ధిపై ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపటి నుండి (ఫిబ్రవరి 11,12,13) బైక్ జాత...

బైక్ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజల ఆక్రోశాన్ని ప్రభుత్వానికి తెలపాలి...
ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రవిశంకర్ రెడ్డి

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ, కడప బెంగళూరు రైల్వే లైన్ ల పై దశబ్దాలుగా పాలకుల చేస్తున్న నిర్లక్ష్యం పై ప్రతిఘటించేదుకు ప్రజలు సిద్ధం కావాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రవిశంకర్ రెడ్డి పిలుపిచ్చారు,ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి. యం. ఓబులేసు యాదవ్ పిలుపునిచ్చారు.

కడపలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఫిబ్రవరి 11,12,13 న జరిగే బైక్ యాత్రపై విలేకరుల సమావేశం నిర్వహించారూ.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ బైక్ జాత కన్యాతీర్థం నుండి మొదలై పులివెందుల మెడికల్ కళాశాల, కడప బెంగళూరు రైల్వే లైన్ ఆగిన పెండ్లిమర్రి వరకు బైక్ యాత్ర ఉంటుందని, అనంతరం కడపలో బహిరంగసభ ఉంటుంది అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన కడప ఉక్కు పరిశ్రమ, కడప బెంగళూరు రైల్వే లైన్, పులివెందుల మెడికల్ కళాశాల ప్రయివేట్ పరం చేయడం ఆపాలని వారు డిమాండ్ చేశారు. కడప ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతా ప్రజల అభివృద్ధికి కీలకమైనది, మొదటి శిలాఫకం వేసి ఇప్పటికి రెండు దశబ్దాలు అవుతుంది, ప్రభుత్వాలు మారుతున్న శిలాఫలాకాలు వేయడం, ఈ ప్రాంతా ప్రజలకు హామీలు ఇస్తూ నమ్మించి మోసం చేయడం తప్ప నిర్మాణం చేయాలేదు. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ చదువుకున్న యువత ఉద్యోగాలా కోసం బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ కి గల్ఫ్ దేశాలకు వాళ్లసేళ్లుతున్నారన్నారు. ఈ పరిశ్రమ పూర్తతే 10 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా, దీనికి అనుబంధంగా ఇంకా వేల మందికి ఉపాధి దొరుకుతుందని, కానీ ఈ ప్రాంత ప్రజలైన ప్రభుత్వాలా నిర్లక్ష్యం వలన పరిశ్రమ శిలాఫలాకానికే పరిమితం అయ్యిందన్నారు. అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా 2700 కోట్ల రూ. బడ్జెట్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సమ భాగస్వామ్యం తో నిర్మాణం పూర్తిచేయాలనీ 2008 లో ఐదు ఏళ్లకు పూర్తి చేయాలనీ శిలాఫకం వేశారు. ఇప్పటికి 358 కోట్లు రు. ఖర్చు చేసి పెండ్లిమర్రి వరకు 21 km వరకు రైల్వే లైన్ పూర్తి చేశారు. రాయచోటి, మదనపల్లి ప్రాంతాలల్లో భూసేకరణ కూడా జరిగిన్ది. ఈ ప్రాజెక్ట్ పూర్తతే ఈ ప్రాంత ప్రజలకు బెంగళూరు కు రవాణా సులభతరం అయ్యి, ఉద్యోగ, వ్యాపారాలకు, విద్యార్థులకు, ఈ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులకు, వైద్యాకోసం ఎంతో ఉపయోగా పడుతుంది... ఇప్పటికే వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ రైల్వే లైన్ నిరూపయోగం గా ఉందని అన్నారు. అదేవిధంగా వైద్య పరంగా ఈ ప్రాంత ప్రజలకు మరొక వరం పులివెందుల మెడికల్ కళాశాల దీని వలన ఈ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను పూర్తి చేసుకోవచ్చు అని, అదేవిధంగా వైద్యం కూడా పేద మధ్యతరగతి ప్రజలకు దగ్గరవుతుందని అన్నారు. కానీ ప్రభుత్వం పిపిపి విధానం ద్వారా ప్రయివేట్ చేస్తే వైద్య విద్య, వైద్యం ప్రయివేట్ వ్యక్తుల చేతిలో వెళ్తుందని దాని వలన ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం అన్నారు. వైద్య విద్యకు కోట్లు ఖర్చు పెట్టాలని అదేవిదంగా వైద్యం కూడా డబ్బున్న వాళ్లకే అనేవిధంగా తయారవుతుందన్నారు. వీటి పై ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11,12,13తేదీలల్లో జరిగే బైక్ జాతను జిల్లా యువత విద్యార్థులు మేధావులు, ప్రజలు జయప్రదం చేయాలనీ, మనకు జరిగిన అన్యాయన్ని ఈ బైక్ యాత్ర ద్వారా ప్రతిఘటన రూపంలో తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో CPIML లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఓబయ్య, జనతా దళ్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, pdsu అంకన్న, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసులు,యువ న్యాయ వాది సూర్య వంశీ యాదవ్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుమన్,గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు జగన్ నాయక్, RSF జిల్లా అధ్యక్షులు వంశీ, నాయకులు శివ కేశవ తదితరులు పాల్గొన్నారు

4
300 views