logo

సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి* జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*.......



*సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి*
: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*.
శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గుత్తి మండలం సేవాగఢ్ లోని సేవాలాల్ మహరాజ్ ఆలయం పక్కనున్న సమావేశ హాల్ లో ఈనెల 13, 14, 15వ తేదీలలో నిర్వహించే శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు పక్కాగా ఉండాలని, ఎంట్రీ మరియు ఎగ్జిట్ జాగ్రత్తగా చూసుకోవాలని, ఆర్డీఓ, డిఎస్పీ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. శానిటేషన్ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలని, ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్రస్ట్ వారితో సమన్వయం చేసుకుని తాగునీరు అందించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసుకుని మానిటర్ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని, జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీ జగదాంబ మాత దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.*
ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అశ్వీన్ మనిదీప్, గుంతకల్లు ఆర్డీఓ ఏబీవీఎస్బి శ్రీనివాస్, శ్రీ సేవాలాల్ మహరాజ్ ట్రస్ట్ అధ్యక్షుడు కేశవనాయక్, ట్రస్ట్ నుంచి అశ్వత్థనాయక్, డిటిడబ్ల్యుఓ శ్రీనివాసరావు, డీఎల్డిఓ విజయలక్ష్మి, సేవాగఢ్ సర్పంచ్ వెంకటేష్, గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ ఏ.బాలకొండయ్య, ఎక్సైజ్ ఎస్ఐ పి.గోపాల్ మరియు సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.*

6
312 views