logo

క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు.

వెలుగోడు (AIMA MEDIA): వెలుగోడు మండల రైతు సోదరులకు ప్రస్తుతము వ్యవసాయ శాఖ వారు వినూత్నంగా క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు బుకింగ్ చేసుకునే విధంగా ప్లే స్టోర్ లో యువరైజేషన్ కిసాన్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచారు అని మండల వ్యవసాయ అధికారి స్వాతి తెలియజేశారు.ఈ యువరైజేషన్ ఆప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డ్రోన్ సేవలను సులభంగా బుకింగ్ చేసుకొనవచ్చును అని,ఈ డ్రోన్ల ద్వారా పురుగుమందులు మరియు ఎరువులు పిచికారి చేసుకోవడానికి చాలా తక్కువ సమయము మరియు వ్యయము గణనీయంగా తగ్గుతుందని రైతులందరికీ తెలిపారు. యువరైజేషన్ కి సంబంధించిన పోస్టర్లను ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది అని రైతులకు వివరించారు.

0
287 views