logo

140 మంది మహిళలకు రుణాలను పంపిణీ చేసిన చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని శిల్పా సేవ సమితి నందు వడ్డీ లేని రుణాలను ఉదయం 10:30 గంటలకు నంద్యాల నియోజకవర్గంలోని 140 మంది మహిళలకు దాదాపు 23 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేసిన చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి.నాగిని రవి సింగారెడ్డి రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గెలుపు ఓటములకు సమానంగా మహిళలకు రుణాలను పంపిణీ చేయడం జరుగుతుందని అదేవిధంగా మహిళాలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు . ఈ విధంగా ఎక్కువ వడ్డీ భారం లేకుండా రుణాలను అందించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సాధికారతకు బలమైన మద్దతు లభించినట్లు అవుతుంది అని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణమ్మ, బ్యాంక్ మేనేజర్ హరి లీల, సేవా సమితి సభ్యులు లక్ష్మీనారాయణ, సహదేవుడు, బ్యాంక్ సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు..

13
909 views