logo

తిరుపతి జిల్లా తిరుపతి పట్టణ అంబేద్కర్ భవన్ నందు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ గా గౌ!! శ్రీ డాక్టర్ శ్రీపతి బాబు గారూ బాధ్యతలు స్వీకరించి

09/02/2026 , తిరుపతి జిల్లా తిరుపతి పట్టణ అంబేద్కర్ భవన్ నందు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ గా గౌ!! శ్రీ డాక్టర్ శ్రీపతి బాబు గారూ బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా తిరుపతికి పట్టడానికి విచ్చేసిన శుభ సందర్భంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య, పుల్లంపేట మండల అధ్యక్షులు సిగమాల రమేష్, రైల్వే కోడూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీకృష్ణ . ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజక వర్గంలో ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర Sc నాయకులు శాంతయ్య మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజవర్గంలో ఎస్సీలు నివసించే గ్రామాలలో ఇప్పటికీ సొంత ఇల్లు ,కనీసం సెంటు భూమి కూడా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ మా నియోజకవర్గంలో దళితులు పైన దాడులు ఘర్షణలు భూ కబ్జాలు హత్యా ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని అన్నారు, రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ రాజకీయ పెత్తనం పూర్తిగా అగ్రవర్గ కులాల చేతులు అధికారం కొనసాగుతుందని, ఈ ఆధునిక కాలంలో కూడా కొన్ని ప్రాంతాలలో అంటరానితనం, సామాజిక బహిష్కరణలు విద్యా ,ఉద్యోగ అవకాశాల్లో ఇంకా వెనకబాటుతనం ,పేదరికం అనేది పెరుగుతుందని , అలాగే అనేక ఎస్సీ ,ఎస్టీ కాలనీలో సరైన రోడ్లు డ్రైనేజీ తాగునీరు వంటి సమస్యలున్నా, సమస్యల పరిష్కారానికి మానిటరింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిష్కారం కావడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైల్వే కోడూరు నియోజవర్గంలోని డీకేటి భూములను సర్వే చేసి ప్రతి పేద దళిత కుటుంబానికి కనీసం మూడు ఎకరాలు చొప్పున కేటాయించాలని నూతనంగా ఎన్నికైన ఎస్సీ కమిషన్ మెంబర్ డాక్టర్ శ్రీపతి గారికి తెలిపారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు ఉన్న విషయంలో బ్యాంకర్స్ తో మాట్లాడి సబ్సిడీ లోన్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ త్వరలోనే రైల్వే కోడూరు విచ్చేసి దళిత సమస్యల పైన పూర్తిస్థాయిలో అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేకూరే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

12
475 views