logo

శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ శిబిరం ముగింపు.

పాణ్యం (AIMA MEDIA): స్థానిక నిరవాడ సమీపంలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరం ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 4 నుండి 9 తేదీ వరకు జేఎన్టీయూఏ బాలికల బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు నిర్వహించారన్నారు.తర్ఫీదు పొందిన జట్టు ఈనెల 11 నుండి15 వరకు , దిండిగల్ చెన్నైలో నిర్వహించే ఆల్ ఇండియా జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు. జట్టు క్రీడాకారులకు కళాశాల ప్రిన్సిపల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి జట్టుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రారెడ్డి మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

0
0 views