logo

ఎన్నో ఏళ్లుగా కరెంటు బిల్లు ఇస్తూ సేవలందించే సుపరిచుతుడిని, ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారు కదండి

విద్యుత్ వినియోగదారులూ నమస్కారమండి.
నేనండి ప్రతీ నెలా మీ ఇంటికి వచ్చి కరెంటు బిల్లు ఇచ్చే వాడినండి .
ఎన్నో ఏళ్లుగా కరెంటు బిల్లు ఇస్తూ సేవలందించే సుపరిచుతుడిని,
ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారు కదండి వాటికి కరెంటు బిల్లులు ఇవ్వడానికి అవదండి అంతా ఆన్ లైన్ అటండి వాటివలన రోజురోజుకు నా జీతం తగ్గిపోతుందండి
చివరిగా అన్ని ఇళ్లకు స్మార్ట్ మీటర్లు మార్చేసి మమ్మల్ని తొలిగించే ప్రయత్నం జరుగుతోందండీ మేము 15 నుంచి 20 సంవత్సరాలుగా ఇదే పనిని నమ్ముకుంటు మా కుటుంబాన్ని పోషించుంకుంటున్నానండి
డిపార్ట్మెంట్ ఇన్ని సంవత్సరాలు గా మమ్మల్ని ఉపయోగించుకొని ఇప్పుడు వెళ్లిపో మంటె ఎక్కడికి వెళ్లిపోతామండి
ఈ విషయం పై MLA ల కూ MP లకు అందరికీ లెటర్ లు ఇచ్చామండి అందరూ కూడా చూస్తామన్నారండి
గౌరవ CS గారు దగ్గర కు CMD గారుల వద్దకు కూడావెళ్లామండి వారుకూడా మీకు ఏదో ఒకటి చేస్తాం అని హామీ ఇచ్చారండి కానీ ఏమీ జరగటలేదండి
రోజురోజుకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నకొలది మా జీతం తగ్గిపోతుందండి
ఇక ఏంచేయాలో తెలియక గత ఏడురోజుల నుండి రాష్ట్రం లో ఉన్న 4500 మంది కరెంటు బిల్లు ఇచ్చే కార్మికులందరూ కలిసి విజయవాడ ధర్నచౌక దగ్గర రాత్రి పగలు బైటాయించి ధర్నా చేస్తున్నామండి
దయచేసి మీ వంతు సాయంగా ఈ మెసేజ్ ముఖ్య అధికారులకు మరియు ప్రభుత్వానికి చేరేవరకు షేర్ చేయండి మమ్మల్ని కాపాడండి

1
0 views